తెలంగాణ

telangana

ETV Bharat / state

బైక్​పై వెళ్తున్న ఇద్దరికి క్వారంటైన్​ ముద్ర - Quarantine

ఓ బైక్​పై ముగ్గరు వ్యక్తులు వెళ్తున్నారు.. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వారిలో ఓ యువతి, మరో యువకుని చేతికి క్వారంటైన్​ ముద్ర కనిపించింది. అప్రమత్తమై వెంటనే ఆస్పత్రికి తరలించిన ఘటన వరంగల్​ పట్టణ జిల్లాలో జరిగింది.

Quarantine seal for the two going on the bike at warangal
బైక్​పై వెళ్తున్న ఇద్దరికి క్వారంటైన్​ ముద్ర

By

Published : Mar 28, 2020, 7:45 AM IST

వరంగల్ పట్టణ జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల చేతులపై క్వారంటైన్ ముద్రలు ఉండడం చూసి ఆందోళనకు గురయ్యారు. ములుగు జిల్లా జాకారం నుంచి ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్తున్నారు. ఆ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపి విచారించి తనిఖీ చేశారు. వాహనంపై ఉన్న యువతి చేతి భాగంలో, మరో యువకుని చేతికి క్వారంటైన్​ ముద్ర కనిపించింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు అస్పష్టమైన సమాచారం ఇవ్వడం వల్ల వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

బైక్​పై వెళ్తున్న ఇద్దరికి క్వారంటైన్​ ముద్ర

ఇదీ చూడండి :పరిమళించిన మానవత్వం.. అన్నార్థులకు చేయూత

ABOUT THE AUTHOR

...view details