ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్... - zptc
ధర్మాసాగర్, వేలేరు మండలాల్లో ప్రాదేశిక రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్ల కోసం అధికారులు మంచినీరు, వృద్ధుల కోసం చక్రాల కుర్చీలను అధికారులు ఏర్పాటు చేశారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఓటర్లు ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ధర్మసాగర్ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం... వేలేరులో 8 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు మంచి నీరు, వృద్ధులకోసం చక్రాల కుర్చీలు ఏర్పాట్లను చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.