వరంగల్ అర్బన్ జిల్లా కలక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జనం పోటెత్తారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేని కారణంగా ఆర్డీవోలు అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎక్కువగా భూ సమస్యలు, ఫించన్లు, సదరన్ సర్టిఫికెట్లు బాధితులు తరలివచ్చారు.
సమస్యల సత్వర పరిష్కారానికై ప్రజావాణి
జిల్లాలో సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కలక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి అర్జీలు సమర్పించారు.
కలక్టరేట్లో ప్రజావాణి