తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు - pongal celebrations news

వరంగల్‌లో సంక్రాంతి సంబురాలు సందడిగా సాగుతున్నాయి. ముగ్గుల పోటీలు, కైట్‌ ఫెస్టివల్‌తో పట్టణం కళకళలాడుతోంది. అధిక సంఖ్యలో యువతులు, మహిళలు పోటీల్లో పాల్గొని.. రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకుంటున్నారు.

pongal celebrations in warangal urban district
సంక్రాంతి సంబురాలు, వరంగల్​, వరంగల్​లో సంక్రాంతి సంబురాలు

By

Published : Jan 15, 2021, 2:59 PM IST

వరంగల్​లో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన రంగోలి పోటీల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందమైన రంగవళ్లులు తీర్చిదిద్దారు.

స్వచ్ఛ సర్వేక్షన్​లో భాగంగా 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం స్లో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ గుండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్​ హాజరయ్యారు.

కనువిందుగా సాగిన కైట్​ ఫెస్టివల్​లో చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ... ఉత్సాహంగా గడిపారు. ముగ్గుల పోటీలను.... మున్సిపల్ అధికారులు పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:భారతదేశానికి అక్షయ పాత్రగా తెలంగాణ.. ధాన్యం ఉత్పత్తిలో టాప్​!

ABOUT THE AUTHOR

...view details