తెలంగాణ

telangana

ETV Bharat / state

బైకు దొంగల ఆట కట్టించిన వరంగల్​ పోలీసులు - వరంగల్​ పోలీసులు

వరుసగా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతూ.. తప్పించుకొని తిరుగుతున్న బైకు దొంగలను వరంగల్​ సీసీఎస్​, మట్టెవాడ పోలీసులు పట్టుకుని... వారి నుంచి 19 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

police caught bike thieves in warangal
బైకు దొంగల ఆట కట్టించిన వరంగల్​ పోలీసులు

By

Published : Jul 16, 2020, 8:31 PM IST

ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తూ.. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఇద్దరు బైకు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ములుగుజిల్లా గోవిందరావు పేటకు చెందిన ఎండీ అఫ్జల్​, జంపయ్యలు.. వరంగల్​లోని దేశాయిపేటలో నివాసం ఉంటున్నారు. అఫ్జల్​ 2004 నుంచి బైకు దొంగతనాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అఫ్జల్​ మొత్త 19 బైకులు దొంగిలించి.. అమ్మేశాడు. రెండు ఇళ్లలో చోరీ కూడా చేశాడు. 2017లో అరెస్టయి.. జైలు శిక్ష కూడా అనుభవించాడు. 2019లో విడుదలై.. మిత్రుడు జంపయ్యతో కలిసి.. మళ్లీ దొంగతనాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో వరంగల్​ పట్టణంలో ఓ బైకు దొంగిలించి దాన్ని అమ్మడానికి తీసుకెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించే మార్గాలకు అలవాటు పడి.. దొంగతనాలు చేస్తున్నట్టు.. పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details