ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బోటులో 62 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల తరఫు బంధువులు ఆందోళన చెందుతున్నారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట మండలం కడిపికొండ ప్రాంతానికి చెందిన గొర్రె ప్రభాకర్ సహా 9 మంది బోటులో ఉన్నట్లు తెలిసింది. వీరిలో వరంగల్ వాసులు గొర్రె ప్రభాకర్, కొమ్మల రవి, సిద్ది వెంకట స్వామి, బాస్కె దశరథములు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మిగిలిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పడవ ఘటనతో వరంగల్ అర్బన్ కడిపికొండలో విషాదఛాయలు - కడిపికొండ
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదం వరంగల్ అర్బన్ జిల్లాలోని కడిపికొండను విషాదంలో ముంచింది. బాధితుల తరఫు కుటుంబీకుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
కడిపికొండలో విషాదఛాయలు