మోసం చేసే కాంగ్రెస్, భాజపాలకు ప్రజలు ఓట్లు వేయవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. అభివద్ధి చేస్తున్న తెరాసను ప్రజలు ఆదరించాలని కోరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి రోడ్ షో నిర్వహించారు.
ఆరునెలల్లో కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగాలు: ఎర్రబెల్లి - పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆరునెలల్లో కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగాలు కల్పిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కేవలం ఆరు నెలల్లో వరంగల్‌లోని కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. భాజపా నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని వారిని నమ్మవద్దన్నారు. నగరంలో జరిగిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని కోరారు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
తెరాస అభ్యర్థులు నూటికి నూరుశాతం విజయం సాధిస్తారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అభివద్ధి చేయాలన్న ఆలోచనలు కాంగ్రెస్, భాజపాలకు లేవన్నారు. ప్రజలంతా తెరాసకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.