ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంజీఎం వైద్యుల 'ఓపెన్ హార్ట్‌ సర్జరీ' విజయవంతం.. చరిత్రలోనే ఓ మైలురాయిగా.. - open heart surgery in warangal mgm hospital

హృదయ స్పందనను 29 నిమిషాల పాటు నిలిపివేశారు. నాలుగు గంటల పాటు శ్రమించి క్లిష్టమైన ఓపెన్‌ హార్ట్‌ సర్జరీని వరంగల్‌ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం శస్త్రచికిత్స చేసిన రోగి కోలుకుంటున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ వెలుపల ఓ ప్రభుత్వాస్పత్రిలో ఓపెన్‌ హార్ట్ సర్జరీ జరగడం ఇదే తొలిసారి. దీంతో ఎంజీఎం ఆస్పత్రి చరిత్రలోనే ఓ మైలు రాయిలాగా నిలిచిపోతుంది.

ఎంజీఎం వైద్యుల 'ఓపెన్ హార్ట్‌ సర్జరీ' విజయవంతం.. చరిత్రలోనే ఓ మైలురాయిగా..
ఎంజీఎం వైద్యుల 'ఓపెన్ హార్ట్‌ సర్జరీ' విజయవంతం.. చరిత్రలోనే ఓ మైలురాయిగా..
author img

By

Published : Sep 29, 2022, 9:14 PM IST

ప్రభుత్వ ఆస్పత్రులంటే కొంత చిన్న చూపు ఉంది. కానీ.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇటీవల ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా చేస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలు కల్పించి వైద్య సేవలు అందిస్తున్నారు. గోదావరిఖనికి చెందిన స్వప్న అనే మహిళ గుండె సంబంధిత సమస్యతో ఈ నెల 8న ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు.. ఆమెకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయాలని నిర్ణయించారు. వైద్యుల బృందం నాలుగు గంటలు శ్రమించి శస్త్ర చికిత్స చేసి మహిళ ప్రాణాలు కాపాడారు.

ఎంజీఎం వైద్యుల 'ఓపెన్ హార్ట్‌ సర్జరీ' విజయవంతం.. చరిత్రలోనే ఓ మైలురాయిగా..

నిమ్స్‌ తర్వాత బైపాస్‌ సర్జరీలు చేయగలిగే సత్తా తమకు ఉందని వరంగల్‌ ఎంజీఎం వైద్యులు చాటారు. ఆస్పత్రి ప్రారంభించిన సంవత్సరంలోనే ఎన్నో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించామని తెలిపారు. అధునాతన వైద్య సదుపాయలను ప్రభుత్వం అందించడంతో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలనూ విజయవతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎంజీఎం, కాకతీయ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి తరహాలో అన్నిచోట్ల సకల సదుపాయాలు కల్పించాలని అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details