రాష్ట్రవ్యాప్తంగా బస్సు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండడం వల్ల తాత్కాలిక డ్రైవర్లు బస్సులను నిర్లక్ష్యంగా నడుపుతూ అమాయకుల ప్రాణాలను బలికొంటున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ బస్టాండ్ తాత్కాలిక డ్రైవరు నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు ప్రాణాలను కోల్పోయింది. రోడ్డు దాటుతున్న క్రమంలో బస్టాండ్ ప్రాంగణం నుంచి బయటకు వస్తున్న వృద్ధురాలిని ఢీకొట్టింది. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు.
తాత్కాలిక డ్రైవరు నిర్లక్ష్యం... ఓ వృద్ధురాలు మృతి - rtc
తాత్కాలిక డ్రైవరు నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ బస్టాండ్ ఆవరణలో చోటుచేసుకుంది.
తాత్కాలిక డ్రైవరు నిర్లక్ష్యం... ఓ వృద్ధురాలు మృతి