రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ వరంగల్ పర్యటనలో భాగంగా అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం రాంపూర్ గ్రామంలోని రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేశారు. సదరు గ్రామంలో మంత్రి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను మంత్రి ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో పాత రహదారిని బాగుచేసిన అధికారులు మరో 5 మీటర్ల మేర రోడ్డును వెడల్పు చేశారు.
మంత్రి పర్యటనతో పాక్షికంగా తీరిన ఊరి సమస్య - minister ktr latest news
మంత్రి కేటీఆర్ పర్యటన కారణంగా ఓ గ్రామానికి రహదారి సమస్య పాక్షికంగా తీరింది. తమ సమస్యల గురించి ఎన్నిసార్లు మొరపెట్టకున్న ఆలకించని అధికారులు ఆగమేఘాల మీద పనులు చేస్తుండడంతో ఆశ్చర్యపోవడం గ్రామస్థుల వంతైంది.
గుంతలు పడిన రహదారిని మరమ్మతులు చేయాలంటూ గతంలో చాలా సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్థులు తెలిపారు. కాగా మంత్రి వస్తున్న కారణంతో అధికారులు ఆగమేఘాలపై పనులు చేస్తుండడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. ప్రారంభోత్సవ స్థలానికి దగ్గరగా కిలోమీటర్ వరకే రోడ్జు వేసిన అధికారులు... గ్రామంలోని మరో అరకిలోమీటర్ వరకు వేయడం విస్మరించారు. అధికారులు స్పందించి మిగిలిన రోడ్డును కూడా పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:భయాందోళనలు వద్దు... స్వీయరక్షణే శ్రీరామ రక్ష: ఈటల