వసతిగృహంలో సరైన సౌకర్యాలు లేవంటూ నర్సింగ్ విద్యార్థినులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జయ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వసతి గృహంలో కనీస వసతులు లేవని ఆరోపించారు. కళాశాల నుంచి ఇంటికి వెళ్లాలంటే రూ.500 డిపాజిట్ చేస్తున్నామని వాపోయారు.
వసతిగృహంలో సౌకర్యాలపై నర్సింగ్ విద్యార్థుల ఆందోళన - వసతిగృహంలో సౌకర్యాలపై నర్సింగ్ విద్యార్థినుల ఆందోళన
వసతిగృహంలో సరైన సౌకర్యాలు కల్పించాలని నర్సింగ్ విద్యార్థినులు డిమాండ్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జయ నర్సింగ్ కళాశాల ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.
వసతిగృహంలో సౌకర్యాలపై నర్సింగ్ విద్యార్థుల ఆందోళన
అధిక ఫీజులు తీసుకుంటూ నాసిరకం ఆహారం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహంలో సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సరైన వసతులు కల్పించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.