కరోనా రెండో దశ కంటినిండా కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. చూస్తుండగానే ప్రాణాల మీదకు తెస్తోంది. ఇళ్ల నుంచి ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. వరంగల్ పరిసర ప్రాంతాల నుంచి నగరంలోని ఎంజీఎం, ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే వైరస్ బాధితులు ఎక్కువవుతున్నారు. ఈ క్రమంలో రహదారులపై అంబులెన్సుల మోతే వినపడుతోంది.
అంబులెన్సుల మోత.. జనాల గుండెల్లో దడ
కరోనా రెండో దశలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. మహమ్మారి కారణంగా చాలామంది మృత్యువాత పడుతున్నారు. కొన్ని రోజులుగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో రహదారులపై అంబులెన్సుల మోతే వినపడుతోంది. ఈ శబ్దంతో గుండెల్లో దడ పుడుతోందని అంటున్నారు స్థానికులు.
పెరిగిన అంబులెన్సుల మోత, కరోనా అంబులెన్సులు
కరోనా విలయతాండవంతో కొన్ని రోజులుగా అంబులెన్సులు రహదారులపై పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో వాటి మోత గుండెల్లో దడ పుట్టిస్తోందని స్థానికులు అంటున్నారు.
ఇదీ చదవండి:అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం