వరంగల్ జిల్లావ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాగేంద్ర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పుట్టల వద్దకు చేరుకుని స్వామికి పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం మహిళలు ప్రత్యేక పూజలు చేసి ఒకరికొకరు వాయనం సమర్పించుకుంటున్నారు. వేయి స్తంభాల ఆలయం, పబ్లిక్ గార్డెన్స్‌లోని పుట్టల వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వరంగల్‌లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు - నాగుల పంచమి వేడుకలు
నాగుల పంచమి వేడుకలు వరంగల్‌లో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు జిల్లావ్యాప్తంగా ఉన్న పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకునేందుకు తరలివచ్చారు.
నాగుల పంచమి వేడుకలు