వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పేదలకు నిత్యావసర సరుకులు పంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నియోజక వర్గంలోని పేదలకు సరుకులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నిత్యావసర సరుకులు పంచిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిత్యావసరాలు పంచుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలో పేదలకు నిత్యావసర సరుకులు పంచారు.
నిత్యావసర సరుకులు పంచిన ఎమ్మెల్యే
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక పేదలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆయన అన్నారు. మరికొన్ని రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉంటూ.. ప్రభుత్వం చెప్పినట్టు వింటే కరోనా ప్రభావం తగ్గే అవకాశం ఉందని తెలిపారు.