ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అండగా నిలిచారు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. బాసర ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల 25మంది విద్యార్థులకు ఆయన నగదు ప్రోత్సాహకం అందించి సత్కరించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడి పెళ్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతిభావంతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే రమేష్ హామీ - mla aruri ramesh
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు తాను అండగా ఉంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆయన నగదు ప్రోత్సాహకం అందించారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడి పెళ్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు.
ప్రతిభావంతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే రమేష్ హామీ
తెరాస పాలనలో ప్రభుత్వ విద్యకు ఎలాంటి ఢోకా లేదన్న తెలిపారు. పేద మధ్య తరగతి కుటుంబాల్లో నిజమైన ప్రతిభావంతమైన విద్యార్థులు ఉన్నారని... అలాంటి వారికోసం ఎంతటి కృషి అయినా చేస్తానని భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి: హన్మకొండలో ఊపందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం