తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​దే విజయం: గండ్ర - trs

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు సూచించారు. ప్రజలు తెరాస పాలనపై విరక్తి చెందారని విమర్శించారు.

కాంగ్రెస్​ ముఖ్య కార్యకర్తల సమావేశం

By

Published : Mar 30, 2019, 4:50 PM IST

కాంగ్రెస్​ ముఖ్య కార్యకర్తల సమావేశం
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్షేత్ర స్థాయి నుంచి కష్టపడి పని చేసి లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సూచించారు. హన్మకొండలోని హంటర్ రోడ్​లో వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని గండ్ర అన్నారు. ప్రజలు తెరాస పాలనపై విరక్తి చెందారని...తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details