కరోనా కట్టడిలో నిరంతరం నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్. ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన ఆటో డ్రైవర్లు, అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
'ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు...' - LOCK DOWN EFFECTS
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లోని పేదలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ వేళ ఒక్కరు కూడా ఆకలితో అలమటించొద్దని... ఎవరికి తోచిన సాయం వారు చేయాలని కోరారు.
'ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు...'
లాక్డౌన్ కారణంగా ఆటో డ్రైవర్లు, రోజువారి కూలీల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఎవరికీ తోచిన విధంగా వారు సాయం అందించాలని కోరారు.