mirchi record rate: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి రైతులపై కాసుల వర్షం కురిపిస్తోంది. కొన్నాళ్లుగా మిర్చి ధరల పెరుగుతున్న కనిపిస్తున్నా.. ఇవాళ మాత్రం కొత్తపుంతలు తొక్కింది. ఏనుమాముల మార్కెట్లో తాజాగా వండర్ హాట్ రకం ఏకంగా 32వేల 500 గరిష్ట ధర నమోదు చేసింది. యూఎస్ 341 రకం 29వేలు పలికింది. తేజ రకం 23వేల 500 రూపాయలకు చేరింది.
గత సీజన్లో శీతల గిడ్డంగుల్లో నిలువ చేసిన మిర్చికి గరిష్ఠ ధరలు దక్కాయని మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. ఇదే అనువైన సమయమని... నిల్వ చేసుకున్న రైతులు సరుకు అమ్ముకుంటే మంచి లాభాలు వస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.