తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరేళ్ల బాలికపై అత్యాచారం - HARRASMENT

ఆరేళ్ల బాలిక... తల్లితో కలిసి దైవ ప్రార్థన కోసం చర్చికి వెళ్లింది. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై హత్యాచారం చేశాడో దుర్మార్గుడు.

ఆరేళ్ల బాలికపై అత్యాచారం

By

Published : Feb 10, 2019, 8:01 PM IST

ఆరేళ్ల బాలికపై అత్యాచారం
వరంగల్​లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 5న తల్లితో కలిసి బాలిక దైవ ప్రార్థన కోసం చర్చికి వెళ్లింది. తల్లి ప్రార్థనలో నిమగ్నం కాగానే... గమనించిన కేబుల్ ఆపరేటర్ కుమారుడు ప్రభు చరణ్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
చిన్నారికి తీవ్రంగా రక్తస్రావం అవడంతో చెట్లపొదల మధ్య వదిలి వెళ్లాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ పేరుతో కేసును నీరుగారుస్తున్నారని ఆరోపిస్తూ... మహిళ సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కాకతీయ థియేటర్ నుంచి ఎంజీఎం కూడలి వరకు ర్యాలీ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details