తెలంగాణ

telangana

ETV Bharat / state

గతేడాది కంటే ఎక్కువ ధాన్యం కొంటున్నాం: ఎర్రబెల్లి - MINISTERS IN TELECONFERENCE

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

పేదలకు మరింత సాయం అందించాలి : మంత్రులు
పేదలకు మరింత సాయం అందించాలి : మంత్రులు

By

Published : May 2, 2020, 11:07 PM IST

వరంగ‌ల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్లిష్ట కాలంలో ప్రజలకు మరింత అండగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. దాతల సాయంతో నిరుపేదలను మరింత ఎక్కువగా ఆదుకోవాలని సూచించారు. గతేడాది ఏప్రిల్ నెల‌లో 12 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. క‌రోనా క్లిష్ట పరిస్థితులున్న ప్రస్తుత కాలంలో 24 లక్షల మెట్రిక్ ట‌న్నుల మేర ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ప్రతి రోజూ ల‌క్షా 50వేల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని సర్కార్ కొంటోందన్నారు. హ‌మాలీలు, గ‌న్నీ బ్యాగులు, ర‌వాణా స‌దుపాయాలు, గోదాములు వంటి అనేక స‌మ‌స్యలున్నా కొనుగోలు రెండింతలు జరగుతోందని వివరించారు. సమావేశంలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details