తెలంగాణ

telangana

'ఆ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం'

By

Published : Sep 2, 2020, 5:57 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు గృహంలో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. పీవీ స్వగృహంలో ఆయన జీవించిన కాలంలో ఏర్పాటు చేసిన జ్ఞాపకాలను పరిశీలించారు. త్వరలోనే ఈ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని అన్నారు.

minister-srinivas-goud-said-we-will-make-those-villages-tourist-destinations
'ఆ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం'

'ఆ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం'

కుటుంబ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వంగర గ్రామాన్ని సందర్శించారు. వంగరను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికల విషయమై చర్చించారు. పట్వారీ నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. దేశంలో అనేక సంస్కరణలు చేపట్టిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ అన్నారు. కేంద్ర ప్రభుత్వాలు ఆయనను గుర్తించకపోవడం, ఆయన విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయకపోవడం చాలా బాధకరమన్నారు. ఆయన చేసిన సంస్కరణలను సీఎం కేసీఆర్​ గుర్తించారని.. రాష్ట్రంతోపాటు దేశ విదేశాల్లో ఏడాది పాటు పీవీ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

వరంగల్ జిల్లాలోని మిగతా పర్యాటక ప్రాంతాలతోపాటు వంగరను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి సీఎం కేసీఆర్ తనను పంపించారని పేర్కొన్నారు. పీవీ స్వగృహంలో ఆయన వాడిన వస్తువులతోపాటు ఆయన జ్ఞాపకాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేసి.. విద్యార్థులతోపాటు తెలంగాణలోని ప్రతి పౌరుడు సందర్శించే విధంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details