ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 1986 బ్యాచ్‌కు చెందిన డాక్టర్లు, కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్ కుమార్‌లు సుమారు రూ.20 లక్షల విలువ గల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మాస్కులు ఇవ్వడం చాలా సంతోషకరమని మంత్రి వ్యాఖ్యానించారు.
'ఈ కష్టకాలంలో అందరూ సేవా దృక్పథంతో ఆలోచించాలి'
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో వసతులపై ఆరా తీశారు.
'ఈ కష్టకాలంలో అందరూ సేవా దృక్పథంతో ఆలోచించాలి'
ఈ కష్టకాలంలో అందరూ సేవా దృక్పథంతో ఆలోచించి ముందుకు రావాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. వైద్యులు, సిబ్బంది సేవలు మరువలేనివని అన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుని రోగులకు భరోసా కల్పించాలని సూచించారు.
ఇదీ చూడండి: Dead : ఆయాసం వస్తోందని ఆస్పత్రికి వెళ్తే.. ఆయువు పోయింది