వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై స్టాళ్లను పరిశీలించారు. ప్రాపర్టీ షో అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. చరిత్రాత్మకమైన వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం త్వరలోనే ఆమోదం తెలుపుతుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ధరలు పెడితే స్థిరాస్తి వ్యాపార రంగం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. హన్మకొండలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు అనూహ్య స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.
'త్వరలో వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం' - errabelli
హన్మకొండలో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హాజరయ్యారు. వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి మంత్రి