తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఉండకూడదు: మంత్రి ఎర్రబెల్లి - తెలంగాణ వార్తలు

కరోనా వ్యాప్తి, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

errabelli dayakar rao review, grain purchase review
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష

By

Published : Apr 5, 2021, 1:51 PM IST

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశించారు. గతేడాది ధాన్యం కొనుగోల్లు విజయంవంతం చేశారన్నారు. వరంగల్‌ పట్టణ జిల్లాలో కరోనా వ్యాప్తి, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

రైతులు తాలు, తేమ లేకుండా ధాన్యం తీసుకురావాలని సూచించారు. అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు పెంచాలని ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష

ఇదీ చదవండి:లాక్‌డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులు సృష్టించిన వ్యక్తి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details