వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మనోవికాస కేంద్రానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. మానసిక దివ్యాంగులకు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, మానవీయతతో కూడినవని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తమ ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను మనోవికాస కేంద్రానికి మంత్రి అందించారు.
మనోవికాస కేంద్రానికి సరకులు అందించిన మంత్రి - minister errabelli
హన్మకొండలోని మనోవికాస కేంద్రానికి ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిత్యావసర సరకులను అందించారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి కోరారు.
మనోవికాస కేంద్రానికి సరకులు అందించిన మంత్రి
'మానవ సేవే మాధవ సేవ' అనే లక్ష్యంతో పని చేస్తున్న వాళ్ల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందన్నారు. పిల్లలు, వృద్ధులు, మానసిక, ఇతర దివ్యాంగులకు సేవలు చేయడం గొప్ప విషయమన్నారు. అలాంటి సేవ చేస్తున్న సంస్థని మంత్రి అభినందించారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నామని, ఇంకా అనేక మంది దాతలు తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదలకు, దివ్యాంగులకు అందించి ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి:నాడు ఎందుకు నోరు మెదపలేదు: శ్రీనివాస్ గౌడ్