ఆదాయం పోయినా పర్వాలేదు... ప్రజల ప్రాణాలే ముఖ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించడం వల్లే కరోనాను నియంత్రించడంలో విజయం సాధించామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న క్రైస్తవ సోదరులకు మంత్రి హన్మకొండలోని సీబీసీ చర్చిలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
క్రైస్తవులకు సరకులు పంచిన మంత్రి ఎర్రబెల్లి - corona virus
హన్మకొండలోని సీబీసీ చర్చిలో క్రైస్తవ సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించడం వల్లే కరోనాను నియంత్రించగలుగుతున్నామని అన్నారు.
క్రైస్తవ సోదరులకు సరకులు పంపిణీ చేసిన మంత్రి
దేశంలో ఏ రాష్టం చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు నెలకు 1500 చొప్పున నగదు ఇస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారని అన్నారు. దయచేసి ప్రజలందరూ ఇంకా కొన్ని రోజుల పాటు ఇళ్ల వద్దనే ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు.
ఇవీ చూడండి: ఉత్కంఠ వీడేనా? లాక్డౌన్పై మంగళవారం మంత్రివర్గ భేటీ