వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని వైద్యులు, వైద్య సిబ్బందికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీపీఈ కిట్లును అందజేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో... 500 పీపీఈ కిట్లను వైద్యులకు అందించారు.
వైద్యులకు పీపీఈ కిట్లు అందించిన మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి
నిత్యం సేవలందిస్తూ... కరోనాను తరిమేందుకు కృషి చేస్తున్న వైద్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీపీఈ కిట్లను అందించారు. కరోనా సమయంలో వీరు చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది అంటూ కొనియాడారు.
వైద్యులకు పీపీఈ కిట్లు అందించిన మంత్రి ఎర్రబెల్లి
విపత్కర పరిస్థితుల్లో వైద్యులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కరోనాను నిర్మూలించేందుకు వారు చేస్తున్న కృషి ఎనలేనిది అంటూ కొనియాడారు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు సైతం తమ సేవలు అందించాలని మంత్రి సూచించారు.
ఇవీ చూడండి:చాపకింద నీరులా కరోనా... ఈ మహమ్మారి ఆగేనా?