పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే ధ్యేయమని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండాప్రకాశ్ తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఏకరూప దుస్తులు, గ్లౌజ్‌లు, బూట్లు, క్యాప్‌లు, మల్టీ విటమిన్ మందుల కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మేయర్‌తోపాటు కమిషనర్ పమేలా సత్పతి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని పారిశుద్ధ్య సిబ్బందికి కిట్లను అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే ధ్యేయం: మేయర్ - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్త
కరోనా కట్టడిలో మందంజలో ఉండి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని వారి సంక్షేమమే తన ధ్యేయమని జీడబ్యూఎంసీ మేయర్ గుండా ప్రకాశ్ తెలిపారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సిబ్బందికి ఏకరూప దుస్తులు, గ్లౌజ్‌లు, మల్టీవిటమిన్ మందులతో కూడిన కిట్లను ఆయన అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే ధ్యేయం: మేయర్
కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని వారు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. పారిశుద్ధ్య సిబ్బందికి అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవడంలో రాష్ట్రంలోనే జీడబ్ల్యూఎంసీ ముందంజలో ఉందని, అందుకు మున్సిపల్ కమిషనర్ చొరవ అభినందనీయమన్నారు. మానవ సేవయే మాధవ సేవయని, సిబ్బంది బాధ్యతతో పని చేయాలని సూచించారు.
ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా