పటిష్ఠ లాక్డౌన్ కారణంగానే రాష్ట్రంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగామని ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ పట్ల ప్రజలెవరూ నిర్లక్ష్యం వహించకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మే'డే'ను పురస్కరించుకుని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌తో కలసి హన్మకొండలో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం కార్మికులకు మే'డే' శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కృషితోనే వైరస్‌ను కట్టడి చేయగలిగామని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు.
'లాక్డౌన్ వల్లే కరోనా కట్టడి..అయినా అప్రమత్తంగా ఉండాలి'
వరంగల్ అర్బన్ జిల్లాలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ పర్యటించారు. హన్మకొండలో కార్మిక దినోత్సవం మే 'డే' సందర్భంగా కార్మిక కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
కార్మికులకు సరుకులను పంచిన ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్