తెలంగాణ

telangana

'పథకాల పేరుతో ఎస్సీల భూములు లాక్కుంటున్నారు'

By

Published : Sep 2, 2020, 7:27 PM IST

తెరాస పాలనలో ఎస్సీలు ఉనికి కోల్పోయారని ఎమ్​ఆర్​పీఎస్​ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. హన్మకొండ ఏకశిల పార్కు ఎదుట ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన దీక్ష ఆయన మద్దతు పలికారు. పథకాల పేరుతో ఎస్సీల భూములు లాక్కుంటున్నారని విమర్శించారు.

manda krishna comment SCs grabbing lands in the name of schemes
'పథకాల పేరుతో ఎస్సీల భూములు లాక్కుంటున్నారు'

'పథకాల పేరుతో ఎస్సీల భూములు లాక్కుంటున్నారు'

ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలనలో ఎస్సీలు రాజకీయ ఉనికిని కోల్పోతున్నారని ఎమ్​ఆర్​పీఎస్​ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. తెరాస సర్కార్‌ ఎస్సీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ హన్మకొండ ఏకశిలా పార్కు ఎదుట ఎఎమ్​ఆర్​పీఎస్ నిరాహారదీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలతో ఎస్సీలకు ఉన్న భూములను ప్రభుత్వం లాక్కుటోందని మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.

ఇస్తామన్నా మూడు ఎకరాల భూమి ఎక్కడా పంపిణీ కాలేదని అన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రతి పక్ష పార్టీలు కూడా ప్రశ్నించడం లేదన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో తెరాస ప్రభుత్వానికి చరమగీతం పడుతామని మందకృష్ణ పేర్కొన్నారు.


ఇదీ చూడండి :'ఆ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం'

TAGGED:

ABOUT THE AUTHOR

...view details