హన్మకొండలో అనుమానాస్పద మృతి - వరంగల్ అర్బన్ జిల్లా
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. నగర శివారులోని రెడ్డిపురం కుంటలో పడి చనిపోయిన ఆ వ్యక్తి.. ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయాడా? లేక ఈత రాక చనిపోయాడా? అని సందిగ్ధం నెలకొంది.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుమార్పల్లికి చెందిన పెయింటర్ ఎండీ మహమ్మద్ నగర శివారులోని రెడ్డిపురంకుంటలో పడి చనిపోయాడు. ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయాడా? లేక ఎవరైనా చంపి అందులో పడేశారా అని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యా? హత్యా? ప్రమాదవశాత్తు చనిపోయాడా ? అని దర్యాప్తు చేస్తున్నారు.