కొవిడ్-19 కారణంగా జనజీవనం స్తంభించిన నేపథ్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక ఆసరా కల్పించనుంది. వారి కుటుంబం గడవడానికి తక్షణ అవసరాల నిమిత్తం ఆసక్తి ఉన్న మహిళలకు రూ.5 వేల రుణం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
పొదుపు సంఘాల సభ్యులకు రూ.5 వేల రుణం
లాక్డౌన్ కారణంగా అనేక చోట్ల పలు రకాల పనులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో మహిళలకు ఆర్థిక ఆసరా కల్పించడం కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మందుకొచ్చింది. ఉమ్మడి వరంగల్జిల్లాలో కుటుంబం అవసరాల నిమిత్తం ఆసక్తి ఉన్న మహిళలకు రూ.5 వేల రుణం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.
పొదుపు సంఘాల సభ్యులకు రూ.5 వేల రుణం
జిల్లా అధికారులు పొదుపు సంఘాల మహిళల వివరాలు సేకరిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ సొమ్మును విడుదల చేయనున్నారు. సులభ వాయిదాలలో వడ్డీతోపాటు చెల్లించేలా రూపకల్పన చేశారు.
ఇదీ చూడండి :విద్యార్థులూ... మానసిక సమస్యలుంటే ఫోన్ చేయండి