తెలంగాణ

telangana

ETV Bharat / state

16 సీట్లు గెలిస్తేనే చక్రం తిప్పగలం: కడియం - ex dyputy cm

లోక్​సభ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఉదయపు నడకకు వచ్చే వారిని పలకరించేందుకు పార్కులు, క్రీడా మైదానాల వద్దకు వస్తున్నాయి. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో తెరాస నేతలు ప్రచారం చేపట్టారు.

అన్ని స్థానాల్లోనూ తెరాసను గెలిపించాలె..

By

Published : Mar 29, 2019, 9:56 AM IST

అన్ని స్థానాల్లోనూ తెరాసను గెలిపించాలె..
తెరాస పార్టీకి అనుకూలమైన ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టేందుకు వీలు ఉంటుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే వినయ భాస్కర్, లోక్​ సభ అభ్యర్థి పసునూరి దయాకర్​తో కలిసి ప్రచారం నిర్వహించారు. తెరాస 16కి 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని కడియం అన్నారు. నిత్యం బిజీగా ఉండే కడియం శ్రీహరి... మైదానంలో అందరిని పలకరించారు. ఎమ్మెల్యే వినయ భాస్కర్, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి దయాకర్​తో కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు.

ABOUT THE AUTHOR

...view details