వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఏకశిలా పార్క్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిశ్చయించారన్నారు.
'ఏకశిలా పార్కుకు జయశంకర్ సార్ ఉద్యానవనంగా నామకరణం' - వరంగల్ హన్మకొండలోని ఏకశిలా పార్క్‌లో జయశంకర్ జయంతి వేడుకలు
వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రొఫెసర్. జయశంకర్ సార్ 86వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని ఏకశిలా పార్క్‌లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు నివాళులర్పించారు.
'ఏకశిలా పార్కుకు జయశంకర్ సార్ ఉద్యానవనంగా నామకరణ'
తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్లు అయిన నీళ్లు, నిధులు, నియామకాలను సంవృద్ధిగా ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఆయన ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్ కృషితో బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని ఎమ్మెల్యే సుదర్శన్ పేర్కొన్నారు. ఏకశిలా పార్క్‌ను జయశంకర్ సార్ ఉద్యానవనంగా నామకరణ చేశామని చీఫ్‌విప్ వినయ్ తెలిపారు.
ఇదీ చూడండి :తెలంగాణలో మరో 2,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదు