అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.27లక్షల విలువగల 900 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు వేల రూపాయల నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
చోరీ విధానంకలకత్తా, పశ్చిమ బంగ రాష్ట్రానికి చెందిన ఈ నలుగురు నిందితులు నగరంలో దుప్పట్లు, బట్టలు అమ్మకునేవారు. జల్సాలకు అలవాటుపడి చోరీ చేయడం మొదలు పెట్టారు. వ్యాపారం చేస్తున్నట్లు వీధి వీధి తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడి ఉన్నదంతా దోచుకెళ్లారు.చోరీ సొత్తులో కొంత బంగారాన్ని వరంగల్లోని బులియన్ మార్కెట్‌లో అమ్మేందుకు యత్నించగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.