వరంగల్ నగరపాలక సంస్థ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా శౌచాలయ నిర్వహణ బాధ్యతలను హిజ్రాలకు అప్పగించింది. హన్మకొండలోని జ్యోతిరావు పూలే కాలనీలో కొత్తగా నిర్మించిన సామూహిక ప్రజా మరుగుదొడ్డి నిర్వహణ బాధ్యతను ట్రాన్స్జెండర్లకు అప్పగించారు.
హిజ్రాలకు శౌచాలయ నిర్వహణ బాధ్యత - Hijras are responsible for the maintenance of toilets
రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా వరంగల్ నగరపాలక సంస్థ.. శౌచాలయ నిర్వహణ బాధ్యతలను హిజ్రాలకు అప్పగించింది. హన్మకొండలోని జ్యోతిరావు పూలే కాలనీలో కొత్తగా నిర్మించిన సామూహిక ప్రజా మరుగుదొడ్డి నిర్వహణ బాధ్యతను ట్రాన్స్జెండర్లకు అప్పగించారు.
హిజ్రాలకు శౌచాలయ నిర్వహణ బాధ్యత
మరుగుదొడ్డిని శుభ్రంగా ఉంచడం, నిర్వహణ ఖర్చు నిమిత్తం నెలకు రూ.16 వేల ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కమ్యూనిటీ టాయిలెట్ నిర్వహణను ట్రాన్స్ జెండర్లకు ఇవ్వడం ఇదే తొలి సారి అని వరంగల్ బల్దియా అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!