కోలాహలంగా మారిన అంజన్న ఆలయాలు
వరంగల్ పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయాలు కోలాహలంగా మారాయి.
హనుమజ్జయంతి వేడుకలు
వరంగల్ పట్టణవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆంజనేయ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హన్మకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున వచ్చిన జనం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలు అంజన్న నామస్మరణతో మార్మోగాయి.