కొన్నిరోజులుగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా గరిష్ఠంగా 43 డిగ్గీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ వేడికి తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. బయటకు వచ్చి గంటలు గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్న ప్రజల కోసం వరంగల్ నగరపాలక సంస్థ ఓ చల్లటి ఉపాయాన్ని ఆలోచించింది.
చౌరస్తాలో చల్లటి ఉపాయం
నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద నీడ తెరలు ఏర్పాటు చేసి వాహనదారులకు ఎండ నుంచి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది. హన్మకొండ అదాలత్, వరంగల్ పోచమ్మ మైదాన్, కాకతీయ కూడలి, పబ్లిక్ గార్డెన్ కూడళ్లలో పచ్చరంగు నీడ తెరలు ఏర్పాటు చేయడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: అపార్ట్మెంట్లలో ఏం జరుగుతోంది...?