ఓరుగల్లు వాసుల ఇలవేల్పైన శ్రీ భద్రకాళీ అమ్మవారిని ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బాలా త్రిపుర సుందరీ అలంకరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సునీత తెలిపారు.
'భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్' - దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళీ అమ్మవారిని ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.
'భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్'