వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో బెస్త కులస్థులు మహాధర్నా చేపట్టారు. గంగపుత్రులను కించపరిచేలా మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
'గంగపుత్రులకు మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలి' - హన్మకొండలో గంగపుత్రుల మహాధర్నా
గంగపుత్రులను కించపరిచేలా మాట్లాడిన మంత్రి తలసాని తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బెస్త కులస్థులు ర్యాలీ నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మహాధర్నా చేపట్టారు.
మంత్రి తలసాని క్షమాపణలు చెప్పాలి: లక్ష్మణ్
ముదిరాజుల భవన భూమి పూజా కార్యక్రమంలో గంగపుత్ర కులవృత్తిని ముదిరాజుల కులవృత్తిగా మంత్రి వ్యాఖ్యానించారని గంగపుత్ర సంఘం వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. అలాగే జీఓ6ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ74ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. వరంగల్‌లో గంగపుత్ర భవన్‌ను నిర్మించాలని అన్నారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగుల శ్రమతో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ'