వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థలో మొదటి సంవత్సరం విద్యార్థులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. నూతన విద్యార్థులకు కళాశాల వాతావరణం, వసతులు, అధ్యాపక బృందం, కళాశాల నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసినట్లు నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. రెండు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కళాశాలలో సీటు పొందిన 1100 మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
నిట్లో నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమం - warangal
వరంగల్ నిట్లో నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు హాజరయ్యారు.
నిట్లో నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమం