తెలంగాణ

telangana

ETV Bharat / state

Horse riding family: గుర్రంపై సవారీ.. ఆ ఫ్యామిలీకి అదే కిక్కు! - Azhagar family horse riding

Horse riding family: గుర్రంపై సవారీ అంటే... ఆ కిక్కే వేరు..! కానీ ఇందుకు కాస్తా ధైర్యం కావాలి. కొన్ని మెలకువలు తెలిసి ఉండాలి. హనుమకొండకు  చెందిన ఓ కుటుంబం గుర్రంపై స్వారీ చేస్తూ సరదాగా గడుపుతోంది. చూడచక్కని తెల్లని అశ్వాన్ని కోనుగోలు చేసి హాయిగా షికారు చేస్తున్నారు.

Azgarh family rides a horse
Azgarh family rides a horse

By

Published : Dec 6, 2021, 5:01 PM IST

Updated : Jun 29, 2022, 9:54 AM IST

గుర్రంపై సవారీ.. ఆ ఫ్యామిలీకి అదే కిక్కు!

Horse riding family: ద్విచక్రవాహనమో.. వీలైతే కారు మీదో తిరగాలని చాలా మంది భావిస్తారు. కానీ హనుమకొండకు చెందిన మహమ్మద్​ అజగర్​కు మాత్రం గుర్రం మీద ప్రయాణం చేయాలనేది చిన్ననాటి కోరిక. చాలా రోజుల తర్వాత.. ఆ కోరిక నెరవేరింది. చూడచక్కని తెల్లని అశ్వాన్ని కొనుగోలు చేశాడు. బయటకు ఎక్కడకు వెళ్లినా... ఇక దాని మీదే ప్రయాణం.

గుర్రంపై స్వారీ చేస్తున్న అతని పేరు మహమ్మద్ అజగర్.... నివాసం... హనుమకొండ జిల్లా పలివేల్పుల. సౌదీఆరేబియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే అజగర్....... లాక్‌డౌన్ తరువాత..ఉద్యోగం కోల్పోయాడు. అనంతరం సౌదీనుంచి వదిలి సొంతూరుకు వచ్చాడు. రాజులా గుర్రం మీద తిరగాలనేది అజ్‌గర్ చిన్ననాటి కల. ఆ కల సాకారానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. గుర్రపు స్వారీ నేర్చుకున్న తర్వాత హైదరాబాద్​లో 81వేలు వెచ్చించి గుజరాత్‌కు చెందిన.. మేలుజాతి తెల్లఅశ్వాన్ని కొనుగోలు చేశాడు. అప్పట్నుంచి.. ఆ గుర్రాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. జిమ్, వాకింగ్, జాగింగ్ పొలం వద్దకు ఆ గుర్రంపైనే వెళుతున్నాడు. ఇప్పుడది వారి కుటుంబంలో ఓ సభ్యురాలిగా మారింది.

సౌది అరేబియాలో ఉద్యోగం చేసేవాడిని. అక్కడ లాక్​డౌన్ వల్ల ఉద్యోగం పోయింది. దీనితో ఊరికి వచ్చేశాను. నాకు చిన్నప్పటి నుంచి గుర్రం మీద స్వారీ చేయాలనేది కల. అది ఇప్పటికి తీరింది. మా అబ్బాయికి కూడా చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. చాలా త్వరగా నేర్చుకున్నాడు. హైదరాబాద్​ నుంచి ఈ గుర్రాన్ని తీసుకొచ్చాను. 81వేలు వెచ్చించి గుజరాత్‌కు చెందిన తెల్ల గుర్రాన్ని కొన్నాను. అప్పటి నుంచి మా ఇంట్లో అందరూ గుర్రపు స్వారీ చేస్తున్నారు.

- అజగర్​, గుర్రపు స్వారీ చేసే వ్యక్తి

నాకు క్రికెట్​, గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. అందుకే నేను దీనిపై స్వారీ చేస్తున్నా...

- అజగర్​ కుమారుడు

అజగర్ భార్య సహా ఆరేళ్ల కుమారుడు అర్హంకు కూడా అశ్వం అంటే ఎంతో ఇష్టం. తండ్రి శిక్షణతో.... చిరు ప్రాయంలోనే అర్హం ఎలాంటి బెదురూ లేకుండా గుర్రపుస్వారీ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గుర్రం పోషణకు...నెలకు 6 నుంచి 8 వేలు ఖర్చు చేస్తున్న అజ్‌గర్ కుటుంబసభ్యులు... గుర్రమే మా వాహనం అంటూ సంతోషంగా చెబుతున్నారు. ఎంతదూరమైనా అలుపులేకుండా గుర్రంపైనే వెళ్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

పెట్రోల్ ఎఫెక్ట్: బండి అమ్మేశాడు... గుర్రంపై తిరుగుతున్నాడు..

గుర్రాల మూలాలు ఎక్కడున్నాయో తెలుసా..?

Last Updated : Jun 29, 2022, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details