తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వ్యాప్తి చెందకుండా విస్తృత చర్యలు

కరోనా వైరస్ కట్టడికి వరంగల్ నగర పాలక సంస్థ ముమ్మర చర్యలు చేపడుతోంది. సోడియం హైపోక్లోరైట్​ మందును విస్తృతంగా చల్లుతున్నారు. అన్ని డివిజన్లలోనూ.. డిసిన్ఫెక్షన్ టన్నెల్​లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటికీ మాస్కులు అందించే పనిలో నిమగ్నమయ్యారు.

కరోనా వ్యాప్తి చెందకుండా విస్తృత చర్యలు
కరోనా వ్యాప్తి చెందకుండా విస్తృత చర్యలు

By

Published : Apr 11, 2020, 1:17 PM IST

వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డ్రోన్, అగ్నిమాపక శకటాలతో.. సోడియం హైపోక్లోరైట్​ రసాయనాన్ని చల్లుతున్నారు. అన్ని చోట్ల డిసిన్ఫెక్షన్ టన్నెల్​లను ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయాల వద్ద, కూరగాయల మార్కెట్ల వద్ద.. వీటిని ఏర్పాటు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. నగరపాలక సంస్థ పరిధిలోని వారందరికీ.. మాస్కులను ఉచితంగా పంపిణీ చేసేందుకు గ్రేటర్ వరంగల్ అధికారులు సన్నద్ధమయ్యారు.

కఠిన చర్యలు..

నగర పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ... ఎవరైనా ఉమ్మి వేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు... గ్రేటర్ వరంగల్ అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చేలా తాము పటిష్ట ప్రణాళికలు చేపడుతున్నామని అధికారులు వెల్లడిస్తున్నరు. ప్రజలు కూడా బాధ్యతగా లాక్​డౌన్​కు సహకరించి... ఇళ్లకే పరిమితమవ్వాలని మేయర్, కమిషనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీచూడండి:ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details