వరంగల్ నగరంలోని నిరుపేదలకు పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. తిలక్ రోడ్లోని పద్మశాలి కమ్యూనిటీ హాల్ వద్ద నిరుపేదలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతోపాటు బియ్యాన్ని అందించారు.
ఆపద సమయంలో పేదలకు దాతల అండ - ఆపద సమయంలో పేదలకు అండ
కరోనా లాక్డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద ప్రజలను ఆదుకోవటానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. దీనిలో భాగంగా వరంగల్ నగరంలో పేదలకు ఎన్ఆర్ఐ సహకారంతో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఆపద సమయంలో పేదలకు అండ
ఓ ఎన్ఆర్ఐ సహకారంతోనే నగరంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ... వ్యక్తిగత శుభ్రతను పాటించాలని కోరారు. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.