తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్ స్థానాన్ని ఏకగ్రీవం చేయండి: ఎర్రబెల్లి - trs

వరంగల్​ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే... అన్ని పార్టీ నేతలతో కలిసి పనిచేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు సూచించారు.

ఏకగ్రీవం చేస్తే కలిసి పనిచేద్దాం

By

Published : Mar 26, 2019, 12:12 PM IST

ఏకగ్రీవం చేస్తే కలిసి పనిచేద్దాం
కేంద్రంలో కాంగ్రెస్​, భాజపా అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయ పడ్డారు. పార్టీ నేతలు నామమాత్రంగానే నామినేషన్లను దాఖలు చేశారని... ఉపసంహరణ చేసుకొని వరంగల్ పార్లమెంటు స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని కోరారు. అలా చేస్తే అన్ని పార్టీల నేతలతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.

కేసీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన...
ఏప్రిల్ 2న అజంజాహి మిల్లు మైదానంలో జరిగే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ మైదానానికి ఒక సెంటిమెంట్ ఉందని... గతంలో ఇక్కడ సభ నిర్వహించిన పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారని వ్యాఖ్యానించారు. కేంద్రంలో స్థానిక పార్టీల నాయకులు సూచించిన అభ్యర్థే ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details