విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ ఒప్పంద కార్మికుడు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కాళ్లు స్తంభంపై ఇరుక్కు పోవడం వల్ల తల కిందులుగా వేలాడుతూ ఆ కార్మికుడు విలివిల్లాడాడు. ఈ ఘటన వరంగల్ పట్టణ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో చోటు చేసుకుంది. సాధారణంగా విద్యుత్ స్తంభాలు ఎక్కడం, వైర్లను సరిచేయడం పనులను విద్యుత్ శాఖకు చెందిన లైన్ మెన్లు నిర్వహిస్తుంటారు. కానీ అందుకు విరుద్ధంగా అదే గ్రామానికి చెందిన అనిల్ అనే ఒప్పంద కార్మికున్ని ఆ పనులకు వినియోగిస్తున్నారు.
కరెంట్ స్తంభంపై విలవిల్లాడిన విద్యుత్ కార్మికుడు
విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ ఒప్పంద కార్మికుడు విద్యుదాఘాతానికి లోనయ్యాడు. ఓ కాలు స్తంభంపై ఇరుక్కుపోయి విలవిల్లాడిపోయాడు.. స్థానికులు వెంటనే స్పందించి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన వరంగల్ పట్టణ జిల్లా పెద్ద పెండ్యాలలో జరిగింది.
ఈరోజు గ్రామంలో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లను లాగడానికి అనిల్‌ని స్తంభంపైకి ఎక్కించారు. పక్కపక్కనే రెండు విద్యుత్ లైన్లు ఉండటం వల్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి అనిల్ ఎక్కిన లైన్‌కి కాకుండా మరో లైన్‌కి ఎల్సీ ఇచ్చారు. అనిల్ కరెంట్ షాక్‌కు గురై ఓ కాలు స్తంభంపైనే ఇరుక్కుని వేలాడాడు. వెంటనే స్పందించిన స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపి వేయించి అనిల్‌ని కిందకు దింపారు. క్షతగాత్రుడిని హూటాహుటిన హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తప్పుడు ఎల్సీ కారణంగానే అనిల్ ప్రమాదానికి గురైనట్లు తెలిసిన స్థానికులు ఆగ్రహించి అక్కడే ఉన్న జేఎల్ఎంని చితకబాదినట్లు సమాచారం.
ఇదీ చూడండి :తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్