వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయంతో పాటు... బాల సముద్రం కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చే ఉద్యోగులతో పాటు కార్మికులు ఈ టన్నెల్ నుంచి లోపలికి ప్రవేశిస్తున్నారు.
వరంగల్‌లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు - డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారులు డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు.
వరంగల్‌లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ల ఏర్పాటు
టన్నెల్ నుంచి వచ్చిన వారికే మార్కెట్లో కూరగాయలు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టన్నెల్ల సంఖ్య త్వరలోనే పెంచుతామని అధికారులు వెల్లడించారు.