తెలంగాణ

telangana

ETV Bharat / state

నాయీ బ్రాహ్మనులకు అండగా నాయీ అభ్యుదయ సంఘం - నాయీ అభ్యుదయ సంఘం

వరంగల్​లోని నిరుపేద నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు తామున్నామంటూ నాయీ అభ్యుదయ సంఘం చేయూతనందిస్తోంది. కరోనా విలయతాండవం చేస్తోన్న సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తమవంతు సాయంగా నిత్యవసరాలను పంపిణీ చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటోంది.

daily essentials distributed to the needy bramhan families by the the naayi bramhan comity in waranagal
నాయీ బ్రాహ్మనులకు అండగా నాయీ అభ్యుదయ సంఘం

By

Published : Apr 8, 2020, 2:32 PM IST

నిరుపేద నాయీ బ్రాహ్మణులకు... నిత్యావసర వస్తువులను అందిస్తూ.. ఓరుగల్లు నాయీ అభ్యుదయ సంఘం దాతృత్వాన్ని చాటుకుంటోంది. సంఘం నాయకులు... ఇంటింటీకీ వెళ్లి పూట గడవని నిరుపేదలకు బియ్యం పప్పూ ఉప్పులు ఇతర సరకులు అందించి అండగా నిలుస్తున్నారు. కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం తమ బాధ్యతని.. ఇక ముందు కూడా ఇదే విధంగా సాయం చేస్తామని వారు చెపుతున్నారు. ప్రభుత్వం నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని లాక్​డౌన్​ను విజయవంతం చేయాలని వారు అన్నారు. స్వీయ జాగ్రత్తలు పాటించి.. కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలను రక్షించుకోవాలని తెలిపారు.

నాయీ బ్రాహ్మనులకు అండగా నాయీ అభ్యుదయ సంఘం

ABOUT THE AUTHOR

...view details