మద్యం మహమ్మారిని రాష్ట్రం నుంచి పారద్రోలాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సీపీఐ నాయకులు ధర్నాకు దిగారు. మద్యానికి బానిసలుగా మారి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'రాష్ట్రంలో మద్యం అమ్మకం నిషేధించాలి' - వరంగల్లో సీపీఐ నేతల ధర్నా
రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లాలో సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. హన్మకొండ ఆబ్కారీ శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
'రాష్ట్రంలో మద్యం అమ్మకం నిషేధించాలి'
మహిళలపై దాడులు పెరగడానికి విచ్చలవిడి మద్యం అమ్మకాలే కారణమని ఆరోపించారు. చిన్న వయస్సులోనే తాగుడుకు బానిసై యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందారు.