వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని కెనరా బ్యాంక్‌లో కరోనా కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయాయి. బ్యాంకులో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ కారణంగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా బ్యాంకుకు సెలవు ప్రకటించి.. శానిటైజర్‌తో బ్యాంకు పరిసరాలను శుభ్రం చేశారు.
కాజీపేట కెనరా బ్యాంక్‌లో కరోనా కలకలం - Kazipet Canara Bank closed with corona effect
వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని కెనరా బ్యాంక్‌లో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బ్యాంకు పరిసరాలను శానిటైజర్‌తో శుభ్రపరిచారు. కరోనా కారణంగా బ్యాంకుకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.
కాజీపేట కెనరా బ్యాంక్‌లో కరోనా కలకలం
ఆ వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన వాడని.. విధి నిర్వహణలో భాగంగా అక్కడి నుండి ప్రతిరోజు వచ్చి వెళ్తుండేవాడని తెలిపారు. బ్యాంక్‌కు తాళం వేసిన అధికారులు.. కరోనా కారణంగా బ్యాంకులో కార్యకలాపాలు నిలిపివేసినట్లు గేటుకు నోటీసు అంటించారు.
TAGGED:
వరంగల్ అర్బన్ జిల్లా వార్తలు